న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమీషనర్‌గా సతీష్ గోల్చా( Satish Golcha)ను నియమించారు. ఢిల్లీ పోలీసు శాఖలో ఆయన 26వ కమీషనర్. సతీష్ నియామకంపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటన జరిగిన నేపథ్యంలో.. పోలీసు కమీషనర్‌ను మార్చేశారు. సతోష్ గోల్చా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అదనపు కమీషనర్‌గా చేస్తున్న ఎస్బీకే సింగ్ స్థానంలో సతీష్‌ను నియమించారు. హోం గార్డ్స్ డీజీగా ఉన్న ఎస్బీకే సింగ్ కు ఆగస్టు ఒకటో తేదీన అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్బీకే సింగ్‌ది 1988 బ్యాచ్. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, యూటీ కేడర్‌కు చెందిన ఆఫీసర్ ఆయన.
ఐపీఎస్ ఆఫీసర్ సతీష్ గోల్చా కూడా ఏజీఎంయూటీ కేడర్ వ్యక్తే. ఢిల్లీ పోలీసు శాఖ ఆయన వివిధ హోదాల్లో చేశారు. డీసీపీ, జాయింట్ కమీషనర్, లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమీషనర్‌గా చేశారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలో ఆయన స్పెషల్ కమీషనర్‌గా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రిజన్స్ శాఖ డీజీగా చేశారు.