యూపీలో ఇసుక మాఫియా హల్చల్ చేసింది. టోల్‌ప్లాజా బారికేడ్లను బద్దలుకొడుతూ 12 ఇసుక ట్రాక్టర్లు కేవలం 52 సెకన్లలో అక్కడినుంచి దూసుకెళ్లాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఓ ట్రాక్టర్ దూసుకెళ్లిందంటే ఎంత స్పీడుతో వెళ్లాయో చెప్పక్కర్లేదు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఆగ్రాలోని టోల్ ప్లాజా వద్ద ఆదివారం జరిగింది. స్థానిక ఇసుక మాఫియాకు చెందిన 12 ఇసుక ట్రాక్టర్లు బారికేడ్లను బద్దలు కొడుతూ దూసుకెళ్లాయి. ఆగ్రా గ్వాలియర్ హైవేపై ఉన్న జజౌ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మొదటి ట్రాక్టర్ రోడ్‌బ్లాక్‌ను ఢీకొట్టి టోల్ చెల్లించకుండా వెళ్లిపోయింది. ఇతర ట్రాక్టర్లు దీనిని అనుసరించాయి. టోల్ గేట్‌ను 52 సెకన్లలో దాటేసాయి. ప్లాజాలో పనిచేసే కార్మికులు కర్రలతో దాడిచేసినా.. ఒక్క ట్రాక్టర్కూడా ఆగలేదు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆగ్రా పోలీసులు తెలిపారు.
#WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September.
(Source: CCTV) pic.twitter.com/p2mfPseths
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022