UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
UP MLC : ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకున్నది. మీరట్, బరేలీ-మొరాదాబాద్, లక్నో టీచర్ సీటును బీజేపీ సొంతం చేసుకున్నది. అయితే సమాజ్‌వాదీ పార్టీ.. వారణాసి, ఆగ్రా టీచర్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(UP MLC) బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకున్నది. మీరట్, బరేలీ-మొరాదాబాద్ టీచర్ సీట్లతో పాటు లక్నో టీచర్ సీటును సొంతం చేసుకున్నది. అయితే సమాజ్‌వాదీ పార్టీ.. వారణాసి, ఆగ్రా టీచర్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మీరట్-సహరాన్పూర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ దినేశ్ గోయల్ మరోసారి తన సీటును నిలబెట్టుకున్నారు. ఎస్పీ అభ్యర్థి ప్రమోద్ సింగ్ భాటియాపై 12,855 ఓట్ల తేడాతో నెగ్గాడు. మీరట్ టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీచాంద్ శర్మ గెలిచారు. అక్కడ ఎస్పీ అభ్యర్థి నితిన్ తోమర్‌పై 13,241 ఓట్ల తేడాతో గెలిచారు.
బరేలీ-మొరాదాబాద్ టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హరి సింగ్ ధిల్లాన్ విజయం సాధించారు. లక్నో టీచర్స్ సీటులో బీజేపీ ఎమ్మెల్సీ ఉమేశ్ ద్వివేదీ గెలిచారు. కీలకమైన వారణాసి టీచర్స్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ లాల్ బిహారీ యాదవ్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రమోద్ మిశ్రాపై 4900 ఓట్ల తేడాతో గెలిచారు. ఆగ్రా టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్తి ఆకాశ్ అగర్వాల్ విజేతగా నిలిచారు. బీజేపీ అభ్యర్థి హరి కిషోర్ తివారీని ఓడించారు. అక్టోబర్ 23న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

