ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 14:20:33

ముంబైలో సెలూన్‌లు రీఓపెన్‌..

ముంబైలో సెలూన్‌లు రీఓపెన్‌..

ముండై : నగరంలో సుమారు ౩ నెలల లాక్‌డౌన్‌ కాలం అనంతరం బార్బర్‌ దుకాణాలు, సెలూన్లు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం శానిటైజర్లను వినియోగిస్తూ కస్టమర్ల టెంపరేచర్‌ను పరిశీలిస్తూ సెలూన్‌లు నిర్వహిస్తున్నారు. రెండో దశ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనేక వ్యాపార రంగాలతో పాటు వస్త్ర దుకాణాలు, బ్యూటీపార్లర్లు, బార్బర్‌ షాపులు, సెలూన్‌లను నేటి నుంచి తెరుచుకునే విధంగా అనుమతులిచ్చింది. 

ముంబై ఘట్కాపూర్‌లోని ఫహీం షేక్‌ అనే సెలూన్‌ ఓనర్‌ పీపీఈ కిట్‌ ధరించి కస్టమర్లకు సర్వీస్‌ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కస్టమర్లు సెలూన్‌కు వచ్చే ముందే అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నారు. మా రెగ్యూలర్‌ కస్టమర్ల నుంచి మాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. మా గురించి ఆలోచన చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ఇది మాకు చాలా ఉధ్వాసనను కలిగించింది. మేము ప్రతీ పరికరాన్ని శానిటైజ్‌ చేస్తున్నాం. సెలూన్‌ మొత్తాన్ని రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తున్నాం. మేము ప్రభుత్వ నిబంధనల కాపీని సెలూన్‌ బయట అతికించాం. మొదటి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారు. కానీ మేము కొందరికే సెలూన్‌లోకి అనుమతించి భౌతిక దూరం పాటిస్తున్నా’మని ఆయన తెలిపారు. logo