Sagarika Ghose : స్వాతంత్య్రానంతరం అతిపెద్ద ఇన్సైడర్ ట్రేడింగ్ స్కామ్ అయిన స్టాక్ మార్కెట్ ఎగ్జిట్ పోల్ స్కామ్‌పై తాము గళమెత్తుతామని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాఘరికా ఘోష్ వెల్లడించారు. బెంగాల్ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వం ఫెడరల్ ఉగ్రవాదాన్ని తలపించేలా వ్యవహరిస్తున్న అనాగరిక తీరుపై పోరాడతామని తెలిపారు.
బెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను తొక్కిపెడుతున్నారని, బెంగాల్ మంత్రిని కలవాల్సిన ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్ పర్యటనకు మోదీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని దుయ్యబట్టారు.
జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యే ఒక రోజు ముందు మే 31న స్టాక్ మార్కెట్లో కొద్దిమంది విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు పెట్టుబడి రెట్టింపు చేశారని, వీరికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా తెలిశాయని ఆమె నిలదీశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం వెల్లడిస్తాయనేది వారికి సమాచారం ఎవరైనా అందించారా అని సాఘరికా ఘోష్ ప్రశ్నించారు.
Read More :