Watch: ఆత్మహత్య చేసుకునేందుకు ఆరో అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే?
ఆత్మహత్యా యత్నం ఫలించకపోవడంతో ఆ వ్యక్తి అరిచి గోలపెట్టాడు. అనంతరం పోలీసులు అతడ్ని రెస్క్యూ చేశారు.
ముంబై: ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేందుకు బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకాడు. అయితే ఆ భవనానికి ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. దీంతో బతికిపోయాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి మహారాష్ట్ర పరిపాలన భవనమైన మంత్రాలయ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయితే సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన నెట్లో పడ్డాడు. తన ఆత్మహత్యా యత్నం ఫలించకపోవడంతో ఆ వ్యక్తి అరిచి గోలపెట్టాడు. అనంతరం పోలీసులు అతడ్ని రెస్క్యూ చేశారు. సేఫ్టీ నెట్లో పడిన అతడ్ని బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యా యత్నంపై ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, 2018 ఫిబ్రవరిలో మంత్రాలయ భవనం పైనుంచి దూకి నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సెఫ్టీ నెట్ ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా భవనం చుట్టూ మధ్యలో ఉన్న పది వేల చదరపు అడుగుల ఖాళీ ప్రాంతంపై దృఢమైన సెఫ్టీ నెట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో నాటి నుంచి మంత్రాలయ భవనంలో ఆత్మహత్యా సంఘటనలు తగ్గాయి.
#WATCH | Man jumps from the 6th floor of Mantralaya (the administrative headquarters of Maharashtra govt in Mumbai), lands in safety net installed in the building; man rescued, police investigation underway
Details awaited. pic.twitter.com/thfCABXoaS
— ANI (@ANI) November 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

