న్యూఢిల్లీ: శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal).. మంగళవారం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గేటు వద్ద సేవాదార్ డ్యూటీ నిర్వహించారు. మతపరమైన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకున్న ఆయన.. మరికొంత మంది నేతలతో కలిసి డ్యూటీ చేశారు. శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ కింద ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. సాద్ నేత సుఖ్దేవ్ సింగ్ దిండ్సా కూడా మెడలో ఫలకను, చేతిలో బల్లాన్ని పట్టుకుని.. గేటు వద్ద సెంట్రీ విధులు నిర్వహించారు. సేవ చేయాలన్న ఆదేశం ఇచ్చారని, ఇది దేవుడు ఇచ్చిన ఆదేశంగా భావిస్తానని, అకాల్ తక్త్లో భాగంగా ఇది జరిగిందని, గేటు వద్ద కూర్చుంటానని, లంగర్లో కూడా సేవ చేయనున్నట్లు సుఖ్బీర్ బాదల్ తెలిపారు.
సుఖ్బీర్ మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిక్కు పెద్దలు ఇటీవల తీర్మానించారు. టంకయ్యగా ఆయనకు ముద్ర వేశారు. దీంతో శిక్షలో భాగంగా ఇవాళ సుఖ్బీర్ సేవలో పాల్గొన్నారు. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మాజితియా .. గోల్డెన్ టెంపుల్లోని లంగర్లో పాత్రలను శుభ్రం చేశారు. గిన్నెలు శుభ్రం చేయడంతో పాటు షూ కూడా శుభ్రం చేయాలని మాజితియాకు శిక్ష వేశారు.
#WATCH | Punjab: Shiromani Akali Dal leader Bikram Singh Majithia washes utensils at Golden Temple in Amritsar following the religious punishment pronounced for him by Sri Akal Takht Sahib yesterday.
The punishment includes a directive to perform as a ‘sewadar’ and clean… pic.twitter.com/oWqmMPDlki
— ANI (@ANI) December 3, 2024