న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) డిసెంబర్ 4, 5 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. 23వ ఇండోరష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా ఇంధనాన్ని దిగుమతి చేస్తున్న నేపథ్యంలో భారత్‌పై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పుతిన్ రాక ప్రత్యేకత సంతరించుకోనున్నది. భారత్ పర్యటనలో మోదీ, పుతిన్ మధ్య చర్చలు జరగనున్నాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ముర్ము రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలకనున్నారు. పుతిన్ రాకతో ద్వైపాక్షిక కార్యకలాపాలు మెరుగుపడుతాయన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆగస్టులో జరిగిన సమావేశంలో పుతిన్ పర్యటన గురించి ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీలో మోదీ, పుతిన్ చర్చలు జరిపారు.