మోదీ.. ఎంత అబద్ధం!
అది 2021 మార్చి 26. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన ‘సత్యాగ్రహ’ పోరాటంలో తానూ పాల్గొన్నానని, అప్పుడు జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. ‘ఇది నిజమేనా? మోదీ అరెస్టు, జైల్లో వేయటం, విడుదలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా?’ అని ఓ ఆర్టీఐ కార్యకర్త ప్రధాని కార్యాలయానికి
- బంగ్లా స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్లానన్న ప్రధాని మోదీ
- అసలు ఆ రికార్డే లేదన్న ప్రధాన మంత్రి కార్యాలయం
- ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెలుగులోకి అసలు విషయం
- మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని నెట్టింట్లో వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అది 2021 మార్చి 26. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన ‘సత్యాగ్రహ’ పోరాటంలో తానూ పాల్గొన్నానని, అప్పుడు జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. ‘ఇది నిజమేనా? మోదీ అరెస్టు, జైల్లో వేయటం, విడుదలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా?’ అని ఓ ఆర్టీఐ కార్యకర్త ప్రధాని కార్యాలయానికి (పీఎంవో) దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, ఆ సమాచారమేదీ తమ వద్ద లేదని పీఎంవో చెప్పటం గమనార్హం. ‘ఢాకాలో ప్రధాని మోదీ స్పీచ్‌కు సంబంధించిన సమాచారం ఉన్నది. దానికి సంబంధించిన లింక్ జత చేస్తున్నాం. 2014లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మాత్రమే ఆయనకు సంబంధించిన అధికారిక రికార్డులను భద్రపరిచాం’ అని వివరించింది.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
‘నాకప్పుడు 20-22 ఏండ్లు ఉంటాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో నేను, నా సహచరులం కలిసి సత్యాగ్రహ పోరాటంలో పాల్గొన్నాం. అందుకుగానూ నేను జైలుకు కూడా వెళ్లొచ్చా’ అని ఢాకాలో జరిగిన సమావేశంలో మోదీ తెలిపారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అయితే ఏకంగా.. ‘ప్రధాని మోదీ ఫేక్ న్యూస్ రుచిని బంగ్లాదేశ్‌కు కూడా చూపిస్తున్నారు’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘#లై లైక్ మోదీ’ అన్న హ్యాష్‌ట్యాగ్ కూడా అప్పట్లో ట్రెండ్ అయ్యింది.
ఈ అబద్ధాలేంటి మోదీ!
బంగ్లా స్వాతంత్య్ర పోరాటంలో మోదీ పాల్గొన్న సమాచారం లేదని పీఎంవో చెప్పటంతో నెటిజన్లు మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ అబద్ధాలేంటి మోదీ? అని నిలదీస్తున్నారు. ‘విద్యార్హతలపై చెప్పింది అబద్ధమే, టీ అమ్మానని చెప్పింది అబద్ధమే, బంగ్లా పోరాటంలో పాల్గొన్నానని చెప్పిందీ అబద్ధమే అని తేలిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్నారు.. వేయలేదు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్నారు.. ఇవ్వలేదు, 2022 వరకు అందరికీ ఇండ్లు కట్టిస్తానన్నారు.. కట్టివ్వలేదు, అసలు మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ ట్వీట్లు చేస్తున్నారు.
దేశానికి గుజరాత్ మాడల్.. అబద్ధం
ప్రతీ అకౌంట్లో 15 లక్షలు.. అబద్ధం
2022 వరకు అందరికీ ఇండ్లు.. అబద్ధం
అవినీతి, నల్లధనానికి తావు లేదు.. అబద్ధం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు.. అబద్ధం
సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. అబద్ధం
వీటన్నింటికీ మించిన అబద్ధం ఏంటంటే..
బంగ్లా పోరాటంలో జైలుకెళ్లానన్న మోదీ
అవును! అసలు ఆ రికార్డే లేదు!!
ఆర్టీఐ కింద పీఎంవో చెప్పిన నిజమిది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

