న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) దీనిపై స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించాలని సోనియా గాంధీని మీడియా ప్రతినిధులు అడిగారు. ‘తప్పుడు వాగ్దానాలు’ అని మెల్లగా ఆమె అన్నారు. ‘రాష్టప్రతి చివరి వరకు చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు. పేలవంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించారు. తన తల్లి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘బోరింగ్? నో కామెంట్స్? అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారా?’ అంటూ సోనియా గాంధీ మాటల భావాన్ని ప్రస్తావించారు.
మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వారు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ విమర్శించారు. ‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు రాష్ట్రపతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబానికి చెందినవారు. ఇప్పుడు ఆమె మన దేశంలో నంబర్ వన్ పౌరురాలు. కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదు. అందుకే వారు ఆమె ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని అన్నారు.
#WATCH | Delhi | After the President’s address to the Parliament, Congress MP Sonia Gandhi says,”…The President was getting very tired by the end…She could hardly speak, poor thing…” pic.twitter.com/o6cwoeYFdE
— ANI (@ANI) January 31, 2025