లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరిని (Jayant Chaudhary) బీజేపీ అవమానంచిందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ ఆరోపించాయి. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో వేదికపై కాకుండా ఎంపీల పక్కన ఆయనను కూర్చొపెట్టారని విమర్శించాయి. అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్ఎల్డీ బదులిచ్చింది. శుక్రవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్, ఎల్జేపీ(ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు వేదికపై ఆశీనులయ్యారు.
కాగా, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఎంపీల పక్కన బెంచీపై కూర్చొన్న ఫొటోను ఎస్పీ పోస్ట్ చేసింది. ‘గొప్ప రైతు నాయకుడు చౌదరి సాహెబ్ మనవడు అయిన నాయకుడ్ని (జయంత్ చౌదరి) వేదికపై కూర్చోబెట్టకపోవడం అవమానకరం. రైతులను ఉగ్రవాదులు, ద్రోహులు అని పిలుస్తున్న పార్టీ బీజేపీ. రైతుల గౌరవం, తన ఆత్మగౌరవం గురించి జయంత్ చౌదరి ఆందోళన చెందితే ఈ అవమానాన్ని సహించకూడదు’ అని ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ ట్వీట్ చేశారు. తమ పార్టీలో చాలా గౌరవం ఉన్న జయంత్ చౌదరి ఇండియా బ్లాక్‌కు తిరిగి రావాలని ఆయన ఆహ్వానించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా బీజేపీపై మండిపడ్డారు. మిత్రపక్షాలను బీజేపీ అవమానిస్తుంది, అగౌరవపరుస్తుంది అని ఆరోపించారు. బీజేపీలోకి ఎవరు వెళ్లినా వారి పరిస్థితి ఇదేనని విమర్శించారు.
కాగా, ఎస్పీ, కాంగ్రెస్ విమర్శలపై ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ స్పందించారు. వేదికపై కూర్చున్నా, కింద కూర్చొన్నా పెద్ద విషయం కాదని అన్నారు. భారత కూటమి తమకు ఎప్పుడు గౌరవం ఇచ్చింది? అని ప్రశ్నించారు. ‘విశాల దృక్పథంతో రాజకీయాలు చేయాలి. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకూడదు. ఎన్డీయేలో ఆర్ఎల్డీ ప్రధాన భాగస్వామ్య పార్టీ. దానితోనే ఉంటుంది’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ సీట్లను ఆర్ఎల్డీ గెలుచుకుంది.
RLD पार्टी के मुखिया @jayantrld को मंच पर स्थान तक नहीं दिया गया जबकि उनकी 2 सीटें हैं ,वहीं 1-1 सीट वाले दलों के नेताओं को मंच पर साथ में बिठाया गया
भाजपा की जाट समाज से नफरत और स्व.चौधरी चरण सिंह जी एवं चौधरी अजीत सिंह जी के प्रति नाटकीय झूठे सम्मान का भंडाफोड़ हो गया है
जयंत… pic.twitter.com/QswEZkHCUX
— SamajwadiPartyMediaCell (@MediaCellSP) June 7, 2024