Roshni Nadar : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL technologies) ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. అదేవిధంగా దేశంలోని టాప్ 10 కుబేర మహిళల జాబితాలో ఆమె అతిపిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించారు. ప్రముఖ సంస్థ ‘ఎం3ఎం హురున్ ఇండియా’ 2025 సంవత్సరానికిగాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో ఈ విషయం వెల్లడైంది.
హురున్ ఇండియా నివేదిక ప్రకారం.. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దాంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోని టాప్ 10 అత్యంత ధనవంతుల జాబితాను పరిశీలిస్తే.. అందులో అతి తక్కువ వయస్కురాలిగా ఆమెనే ఉన్నారు. కాగా టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆమె.. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.