న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అక్రమంగా రూ.58 కోట్లు సంపాదించారని ఈడీ తెలిపింది. గురుగ్రామ్‌లోని శికోపూర్‌లో మోసపూరిత భూ లావాదేవీలో సంపాదించిన ఈ సొమ్మును మరికొన్ని ఆస్తులుగా మార్చినట్లు పేర్కొంది. వాద్రాతోపాటు ఆయన సన్నిహితులు సత్యానంద్ యజీ, కేవల్ సింగ్ విర్క్లపై కేసు దాఖలు చేసింది. దీనిని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు విచారిస్తుంది.
ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఈడీ తెలిపింది. కానీ వాస్తవంగా అంగీకరించినది రూ.15 కోట్లు అని పేర్కొంది. రూ.7.5 కోట్లకు చెక్కును ఇచ్చారని, కానీ దానిని నగదుగా మార్చలేదని చెప్పింది.
ఈ విధంగా చేయడం వల్ల రూ.45 లక్షల మేరకు స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టారని చెప్తూ, దీనివల్ల క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిగినట్లు వెల్లడవుతున్నదని వివరించింది. వాద్రా పలుకుబడితో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌కు కమర్షియల్ లైసెన్స్‌ను అదే గ్రామంలో వచ్చేలా చేశారని పేర్కొంది. అనంతరం ఈ భూమిని డీఎల్ఎఫ్కు 58 కోట్లకు విక్రయించినట్టు తెలిపింది.