లక్నో: ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత సిబ్బంది చేతిలోని డబ్బును లాక్కున్నారు. (Robbers Try To Snatch Money) బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే సేల్స్‌మెన్ ఆ బైక్ వెంటపడ్డాడు. అక్కడి సిబ్బంది ఒక దొంగను పట్టుకుని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పెట్రోల్ బంకు వద్దకు వెళ్లారు. బైక్‌లో పెట్రోల్ నింపుకున్నారు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి సేల్స్‌మెన్ చేతిలోని డబ్బును లాక్కున్నాడు. వారిద్దరూ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
కాగా, పెట్రోల్ బంకు వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ బైక్ వెంట పరుగుతీశాడు. దానిని నిలువరించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బైక్ వెనుక కూర్చొన్న డబ్బు లాక్కున్న వ్యక్తిని మరో ఇద్దరు సిబ్బంది పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. నిందితులను డానిష్, ఫర్మాన్‌గా గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ పెట్రోల్ బంకులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : अमरोहा में पंट्रोल पंप के सेल्समैन से हुई लूट, कर्मचारियों ने दौड़ाकर पकड़ा
◆ पुलिस ने दो बदमाशों को गिरफ़्तार किया #PetrolPump | #Amroha | Petrol Pump | Uttar Pradesh | Amroha pic.twitter.com/6CxmUGKuzD
— News24 (@news24tvchannel) April 5, 2025