న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో అరుదైన సంఘటన జరిగింది. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందించారు. అయితే ఆ ప్రశ్న అర్థం కాకపోవడంతో ఆయన శాఖకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న స్పీకర్ ఓం బిర్లా సీటులో కూర్చోవాలని ఆ మంత్రికి చెప్పారు. (Road Transport Minister Asked To Sit) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజస్థాన్‌లోని కరౌలీ-ధోల్పూర్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ భజన్ లాల్ జాతవ్, జాతీయ రహదారి ప్రమాణాల గురించి ప్రశ్న అడిగారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వాటి రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించే యోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
కాగా, కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి అజయ్ టామ్టా ఈ ప్రశ్నపై స్పందించారు. ఒక ఎంపీ మహారాష్ట్ర గురించి ప్రశ్న అడిగినట్లు తెలిపారు. ప్రతిపక్షం స్పందిస్తూ మహారాష్ట్ర కాదు రాజస్థాన్ అని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆ ప్రశ్న గురించి మంత్రికి తెలియజేశారు. అయితే 2014కు ముందు ఆ తర్వాత జాతీయ రహదారులకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి చదివారు. 2014 నాటికి 91,281 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండగా, ప్రధాని మోదీ హయాంలో 1,41,136 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు. దీంతో ఎంపీ అడిగిన ప్రశ్న మంత్రి అజయ్‌కు అర్థం కాలేదని స్పీకర్ గ్రహించారు. కేంద్ర మంత్రిని కూర్చోమని ఆయన సైగ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सांसद ने पूछा- राष्ट्रीय राजमार्ग घोषित करने के नियम क्या हैं?
मंत्री जी को समझ ही नहीं आया. पहले से जो लिखकर लाए थे वही पढ़ने लगे.
स्पीकर ने मंत्री जी को रोककर बैठा दिया. ये तो हाल है मंत्रियों काpic.twitter.com/XXvrkz4v51
— Gaurav Shyama Pandey (@Gauraw2297) August 2, 2024