న్యూఢిల్లీ : పెరుగుతున్న మెమొరీ ఖర్చుల వల్ల ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయని ఆపిల్, ఎక్స్ బాక్స్ ఇతర టెక్ కంపెనీలు హెచ్చరించాయి. అమెజాన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఏఐ క్లౌడ్ సేవల్లో ఒక దాని ధర పెంపును ప్రకటించింది. దీని వల్ల ఏఐ ఆధారిత యాప్లు, సేవలు మరింత ఖరీదుగా మారవచ్చు.
చాలా మంది డెవలపర్లు ఏఐ ఉత్పత్తుల నిర్మాణానికి, వాటిని కస్టమర్లకు అందించడానికి అమెజాన్ వెబ్ సర్వీస్(ఏడబ్ల్యూఎస్)పై ఆధారపడుతారు. కాబట్టి వారు ఈ అధిక మౌలిక సదుపాయాల ఖర్చును వినియోగదారులపై మోపాలని నిర్ణయించుకొంటే ఆ భారం వారిపైనే పడొచ్చు. ఎంఎల్ సర్వీస్ కోసం ఇచ్చే తన ఈసీ2 కెపాసిటీ బ్లాక్స్ ధరలను అమెజాన్ జూలై 1 నుంచి సుమారు 20 శాతం పెంచనున్నది.