ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో చిచ్చుపెట్టాయి. అంచనాలకు భిన్నంగా దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న కూటమి విచ్ఛిన్నం దిశగా వెళ్తున్నది. ఇందులో భాగంగా కూటమికి దూరం జరగాలని శివసేన(యూబీటీ) దాదాపుగా నిర్ణయించింది. త్వరలో జరగనున్న ముంబై, థానే, నాగ్పూర్ మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ శనివారం ప్రకటించారు. పొత్తుల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశాలు లభించవని, అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.