ప్రజారోగ్యంలో విప్లవాత్మక ముందడుగు : వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని

న్యూఢిల్లీ : (Venkaiah Naidu) భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు కార్డుతోపాటు ఆరోగ్య వివరాలన్నీ డిజిటటైజేషన్ చేయడం వల్ల చికిత్స అందించడం సులభం అవుతుందన్నారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన చేకూర్చేందుకు, వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ రూపొందించిన జాతీయ హెల్ప్‌లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ఉపరాష్ట్రపతి గురువారం ప్రారంభించి మాట్లాడారు.
రొమ్ము క్యాన్సర్ విషయంలో మహిళల్లో చైతన్యం కల్పించేందుకు డాక్టర్ పీ రఘురామ్, డాక్టర్ ఉషాలక్ష్మి బృందం చేస్తున్న ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. తెలుగు, కన్నడ, తమిళం సహా 11 భారతీయ భాషల్లో ఈ హెల్ప్ లైన్ నడపాలన్న ఆలోచనను ప్రశంసించారు. వ్యాధుల తీవ్రత విషయంలో గణాంకాలను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అయితే నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు గుర్తుచేస్తాయన్నారు.
మారుతున్న జీవనశైలి కారణంగానే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని జయించడం వంటివి నిత్య జీవితంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా కొంతమేర ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషాలక్ష్మి, డాక్టర్ పీ రఘురామ్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఇండియా ప్రతినిధులు, బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
జమ్ము చేరిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
చైనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నేపాల్ ప్రజలు
సిద్ధూ-చన్నీ భేటీ షురూ! హైకమాండ్ నుంచి దూత..
అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

