న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంలో మార్పులు జరగాలని భారత్ కోరింది. ఏకపక్ష ఒప్పందం కొనసాగుతున్నదని, నేటి పరిస్థితులకు తగినట్లుగా ఈ ఒప్పందంలోని నిబంధనలను మదింపు చేయాలని చెప్పింది. ఈ మేరకు గత నెల 30న పాకిస్థాన్‌కు నోటీసు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నదీ జలాల వినియోగం, జనాభా పరిస్థితులు మారుతున్నాయని ఈ నోటీసులో భారత్ తెలిపింది. పరిశుద్ధ ఇంధనం దిశగా భారత్ ముందడుగు వేస్తున్నదని, అందువల్ల ఈ ఒప్పందాన్ని సవరించాలని కోరింది.