ఐఎంపీఎస్ ట్రాన్సఫర్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ట్రాన్జాక్షన్పై 2 లక్షల పరిమితి ఉన్న విషయం తెలిసిందే. ఐఎంపీఎస్ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత పెరిగిందని, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో.. ఐఎంపీఎస్ లిమిట్‌ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదన చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఇవాళ ఆయన వెల్లడించారు.
పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ల వల్ల లావాదేవీలను పెంచేందుకు కూడా ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకున్నది. పీఏ సదుపాయాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేసి, అక్కడ జియో ట్యాగింగ్ టెక్నాలజీని పెంపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక వడ్డీ రేట్లను యధాతథం ఉంచారు. వరుసగా ఎనిమిదోసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

