గువాహటి : స్మార్ట్ఫోన్ను ఉపయోగించి క్షయ వ్యాధిని గుర్తించగలిగే ఓ పోర్టబుల్ డివైజ్ను అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధిపరిచారు. ఈ డివైజ్ పని చేయడానికి రసాయనాలు లేదా రంగులు అక్కర్లేదు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పబిత్ర నాథ్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.
పబిత్ర మాట్లాడుతూ, టీబీ బ్యాక్టీరియాకు ఉండే సహజ ప్రకాశం (ఆటోఫ్లోరసెన్స్) ఆధారంగా ఈ డివైజ్ క్షయ వ్యాధిని గుర్తిస్తుందని తెలిపారు. దీని బరువు 300 గ్రాముల కన్నా తక్కువ అని, ధర సుమారు రూ.25,000 అని చెప్పారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లవచ్చునని తెలిపారు.