బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు రేణుకా స్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు బుధవారం ఉపశమనం కల్పించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు ఆరు వారాల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది. వారంలోగా వైద్య నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో ఆయన జూన్ 11న అరెస్టయ్యారు. ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు.