తిరువనంతపురం: ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త, భారత చారిత్రక పరిశోధన మండలి(ఐసీహెచ్ఆర్) మాజీ చైర్మన్ ఎంజీఎస్ నారాయణన్ (93) వృద్ధాప్య సమస్యలతో శనివారం కోజికోడ్‌లో కన్నుమూశారు. దేశంలోని ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఆయన కాలికట్ యూనివర్సిటీలోని చరిత్ర విభాగాధిపతిగా 1976 నుంచి 1990 వరకు, ఐసీహెచ్ఆర్ చైర్మన్‌గా 2001 నుంచి 2003 వరకు పనిచేశారు.
మలయాళం, ఇంగీష్, తమిళం, సంస్కృత భాషలలో నిష్ణాతులైన ఆయన బ్రాహ్మీ, వట్టేళుతు, గ్రంథ లిపులలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. చారిత్రక పరిశోధకుడిగానే కాకుండా కవిగా, సాహితీ విమర్శకుడిగా, రాజకీయ పరిశీలకుడిగా, విమర్శకుడిగా, సామాజిక కార్యకర్తగా భిన్న రంగాలలో విశేష సేవలందించారు.