ప్రముఖ చిత్రకారుడు జోగెన్ చౌదరి మృతి
ప్రముఖ చిత్రకారుడు, టీఎంసీ మాజీ రాజ్యసభ ఎంపీ జోగెన్ చౌదరి (87) కన్నుమూశారు. 14 నెలలుగా అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు ఇటీవల దుర్గాపూజ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి.
కోల్‌కతా : ప్రముఖ చిత్రకారుడు, టీఎంసీ మాజీ రాజ్యసభ ఎంపీ జోగెన్ చౌదరి (87) కన్నుమూశారు. 14 నెలలుగా అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు ఇటీవల దుర్గాపూజ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో కోల్‌కతాలోని ఆనందపూర్‌లో ఉన్న ప్రైవేట్ దవాఖానలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించి ఆదివారం ఉదయం 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఇండియాలోని ప్రసిద్ధ చిత్రాకారుల్లో జోగెన్ ఒకరు. శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన సేవలకు గాను 2001లో ప్రతిష్టాత్మక కాళిదాస్ సమ్మాన్‌తో పాటు 2012లో బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం ‘బంగ విభూషణ్’ దక్కాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

