వయనాడ్‌లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో 2012 బ్యాచ్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి సీరం సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం వయనాడ్ సహాయక చర్యలకు ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇంతకుముందు ఆయన కేరళ ఆగ్రో బిజినెస్ లిమిటెడ్ డైరెక్టర్‌గా, కోజికోడ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కొవిడ్ సమయంలో ఆయన పనితీరుకు ప్రశంసలు దక్కాయి. వయనాడ్ సహాయక బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.