లక్నో: జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్ కోసం ఎవరూ సహకరించలేదు. అతడి తరుఫున న్యాయవాది ఎవరూ లేరు. చివరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషితో అతడు బెయిల్ పొందాడు. దీంతో జైలు నుంచి విడుదలైన ఆ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్యాన్స్ చేశాడు. (Prisoner Dance) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఈ సంఘటన జరిగింది. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తరుఫున వాదించేందుకు న్యాయవాది లేరు. అలాగే బెయిల్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జరిమానా చెల్లించకపోవడంతో మరికొంత కాలం అదనంగా జైలులో ఉన్నాడు.
కాగా, పలు నెలలపాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ గురించి లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలిసింది. దీంతో ఆ వ్యక్తి బెయిల్ కోసం సహకరించింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించకపోయినప్పటికీ బెయిల్‌పై బుధవారం అతడు విడుదలయ్యాడు.
మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఆనందం పట్టలేకపోయాడు. అక్కడున్న పోలీసులు, జైలు సిబ్బందిని అతడు పట్టించుకోలేదు. ఆ జైలు బయట స్లో మోషన్లో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch– After being released from jail, a prisoner celebrated by dancing in Uttar Pradesh’s Kannauj.#UPNews #Kannauj #UttarPradesh #ViralVideo #Dance pic.twitter.com/2GKuF6vXE2
— TIMES NOW (@TimesNow) November 28, 2024