న్యూఢిల్లీ, మార్చి 17: మాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గరిష్ఠ వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చినట్టు పేర్కొంది. అగ్నివీరుల మొదటి బ్యాచ్ వారికి అయిదేండ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేండ్లు సడలింపు ఇస్తున్నట్టు తెలిపింది.
మాజీ అగ్నివీరులకు దేహ దారుఢ్య పరీక్ష నుంచి కూడా మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల బీఎస్ఎఫ్లో కూడా మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.