న్యూఢిల్లీ : దేశంలో 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును పెంచుతున్నట్టు కేంద్ర రవాణా శాఖ శుక్రవారం ప్రకటించింది. 20 ఏండ్లు పైబడిన వాహనాలు వినియోగించకుండా ప్రజల్ని నిరుత్సాహపర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
20 ఏండ్లు దాటిన లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ) రెన్యువల్ ఫీజును రూ.5 వేల నుంచి 10 వేలకు, 20 ఏండ్ల పైబడిన మోటారు సైకిళ్ల రెన్యువల్ ఫీజును రూ.వెయ్యి నుంచి 2 వేలకు, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.3,500 నుంచి 5 వేలకు పెంచుతున్నట్టు వివరించింది.