న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ టైకూన్ లలిత్ గోయల్‌ను ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెట్ డైరక్టరేట్ అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐఆర్‌ఈవో గ్రూపు చైర్మెన్‌గా లలిత్ గోయల్ ఉన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న లలిత్ గోయల్‌ను గత వారం ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. గోయల్‌పై ఇటీవల ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక నేరాలపై ఈడీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఐఆర్‌ఈవో గ్రూపుపై 2010 నుంచి విచారణ జరుగుతున్నది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టును ఉల్లంఘించినట్లు లలిత్‌పై కేసు నమోదు అయ్యింది.