ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్సీపీకి మోదీ కొత్త కేబినెట్లో మొండిచేయి ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అజిత్ పవార్ డిమాండ్ చేశారు. అయితే కొత్త కేబినెట్లోకి ఆయనను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వేచి ఉంటామని అజిత్ పవార్ అన్నారు. ఆదివారం ఈ అంశంపై మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారని తెలిపారు. అయితే కేబినెట్ పోస్ట్ మాత్రమే తమకు కావాలని చెప్పామన్నారు. దీని కోసం కొన్ని రోజులు ఎదురుచూస్తామని చెప్పారు. ‘మాకు ఇవాళ ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో రాజ్యసభలో ముగ్గురు సభ్యులు మాకు ఉంటారు. పార్లమెంటులో మా ఎంపీల సంఖ్య నాలుగు అవుతుంది. కాబట్టి మాకు ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖ సీటు ఇవ్వాలని అడిగాం’ అని అన్నారు.
మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ (అజిత్ పవార్)కు ఎంవోఎస్ (సహాయ మంత్రి) పదవిని ఆఫర్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ పార్టీ కేబినెట్ బెర్త్ కావాలని పట్టుబట్టిందని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ బెర్త్ పొందేందుకు ఎన్సీపీ అంగీకరించిందని ఫడ్నవీస్ వెల్లడించారు.
#WATCH | Maharashtra Deputy CM and NCP chief Ajit Pawar says, "Praful Patel has served as a cabinet minister in the central government and we did not feel right in taking Minister of State with independent charge. So we told them (BJP) that we are ready to wait for a few days,… pic.twitter.com/POBpI0pS3L
— ANI (@ANI) June 9, 2024
#WATCH | Maharashtra Deputy CM Devendra Fadnavis says, "Nationalist Congress Party was offered one seat from the government- MoS Independent Charge. But their request was from their side Praful Patel's name was finalised and he was already a minister. Therefore, he would not be… pic.twitter.com/pqij8h1Vxc
— ANI (@ANI) June 9, 2024