Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది.
మరోవైపు దేశం యావత్తూ వినేశ్ వెంట నిలిచి సంఘీభావం ప్రకటించింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఆమె గెలిచిందని వినేశ్ మనోనిబ్బరంతో ముందుకుసాగాలని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు వినేశ్ ఫొగాట్‌పై ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటం విచారకరమని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ అన్నారు.
మనకు మెరుగైన అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని, అలా అయితే వినేష్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారతీయులు ఇవాళ విచారంలో ఉన్నారని అన్నారు. ఈ అంశంలో భాకీ కుట్ర జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. అథ్లెట్లపై ప్రభుత్వం ఎంత మొత్తం వెచ్చిస్తోందనే వివరాలతో క్రీడా మంత్రి ఇవాళ సభలో చేసిన ప్రకటన అథ్లెట్లను అవమానించేలా ఉందని దుయ్యబట్టారు.
Read More :