Rashtrapati Bhavan | న్యూఢిల్లీ: గురువారం రాష్ట్రపతి భవన్‌లోని రెండు హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా, అశోక హాల్‌ను ‘అశోక మండపం’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది. రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నమే ఇదని వివరించింది. దర్బార్ హాల్‌ను జాతీయ అవార్డులు ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా, అశోక హాల్ ఓ బాల్రూమ్.