ముంబై: ర్యాప్ సింగర్ బాద్షాను ముంబై సైబర్ పోలీసులు విచారిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీ యాప్ ఫెయిర్‌ప్లే(FairPlay App)తో లింకున్న కేసులో అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫెయిర్‌ప్లే యాప్‌ను ర్యాపర్ బాద్షాతో పాటు మరో 40 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆ యాప్‌లో ప్రమోట్ చేసినట్లు ర్యాపర్ బాద్షాపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేసేందుకు కేవలం వయాకామ్ 18కు మాత్రం ఐపీఆర్ హక్కులు ఉన్నాయి. కానీ ఫెయిర్‌ప్లే యాప్‌లో అక్రమంగా ఆ మ్యాచ్‌లను ప్రసారం చేశారు. కొందరు ఫిల్మ్ స్టార్స్ కూడా ఆ టోర్నమెంట్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ ప్రైవసీ కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో మరికొంత మంది ఫిల్మీ హీరోలకు సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మహాదేవ్ యాప్‌తో ఫెయిర్‌ప్లే యాప్‌కు లింకు ఉంది. మహాదేవ్ యాప్‌ను సౌరబ్ చంద్రకార్, రవి ఉప్పల్ ప్రమోట్ చేస్తున్నారు. మహాదేవ్ యాప్‌లో జరిగిన మనీల్యాండరింగ్ కేసును ఈడీ విచారిస్తున్నది.
రన్బీర్ కపూర్, హుమా ఖురేషి, కపిల్ శర్మ, శ్రాద్ధా కపూర్ లాంటి సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రాకార్ పెళ్లి యూఏఈలో జరిగింది. ఆ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, సునిల్ శెట్టి, టైగర్ ష్రాఫ్‌లు కూడా హాజరయ్యారు.