న్యూఢిల్లీ: ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్కు క్షమాపణ లేఖను సమర్పించాడు. అల్లబదియాతో పాటు అపూర్వ ముఖిజా కూడా క్షమాపణ పత్రాన్ని అందజేసింది. ఇద్దరూ క్షమాపణ లేఖలు ఇచ్చిన విషయాన్ని ఎన్సీడబ్ల్యూ ప్యానల్ చైర్పర్సన్(NCW Chief) విజయా రహత్కార్ తెలిపారు. యూట్యూబ్ షోలో వాళ్లు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగానే ఆమోదించడం లేదన్నారు.
జాతీయ మహిళా కమిషన్ ప్యానెల్ ముందు గురువారం యూట్యూబర్ అల్లబదియా, ముఖిజా, ప్రొడ్యూజర్లు సౌరభ్ బోత్రా, తుషార్ పూజారిలు హాజరయ్యారు. ఇద్దరు యూట్యూబర్లను కొన్ని గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసభ్యకరమైన భాషను ఆమోదించబోమని కమిషన్ స్పష్టం చేసింది. సామాజిక ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లకు నోటీసులు ఇచ్చామని, కమిషన్ ముందు హాజరైన వాళ్లు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా మాట్లాడనున్నట్లు అల్లబదియా చెప్పాడు. మహిళల పట్ల గౌరవంతో మాట్లాడనున్నట్లు పేర్కొన్నాడు. తల్లితండ్రుల శృంగారం గురించి కామెంట్ చేసిన అల్లబదియాపై దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అరెస్టు నుంచి అతనికి సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది. అతని మెదడు మలినమైపోయినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
#WATCH | India’s Got Latent case | Delhi: National Commission for Women (NCW) chairperson Vijaya Rahatkar says, “…The four people appeared before the Commission yesterday. The obscene language they used in the show is absolutely indecent. Commission will never accept it. Using… pic.twitter.com/wiSBwTP8O8
— ANI (@ANI) March 7, 2025