బరేలీ, డిసెంబర్ 21: మాజీ ఎంపీ జయప్రదపై ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో విచారణకు వరుసగా గైర్హాజరు కావడంతో ఈ చర్యలు తీసుకొన్నది. సీనియన్ నటి అయిన జయప్రద గతంలో రామ్‌పూర్ నుంచి ఎస్పీ ఎంపీగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి.. ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.