Loksabha Elections 2024 | కాంగ్రెస్ పార్టీని ప్రజలే రద్దు చేస్తారు : రాజ్‌నాథ్ సింగ్
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ 400 స్ధానాలు గెలుచుకోవాలనే తమ నినాదం నిజమవుతుందని స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ 400 స్ధానాలు గెలుచుకోవాలనే తమ నినాదం నిజమవుతుందని స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం లభించిన వెంటనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మ గాంధీ చేసిన సూచనలను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు.
కానీ ఇప్పుడు ప్రజలే కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తారని అన్నారు. ఢిల్లీలోని అన్ని స్దానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్ధి మనోజ్ తివారీ నామినేషన్ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ హాజరవడం తనకు ఆశీర్వాదంగా భావిస్తానని మనీష్ తివారీ పేర్కొన్నారు. 2019లోనూ రాజ్‌నాథ్ సింగ్ తన వెంట ఉన్నారని, అప్పట్లో తన మెజారిటీ 1.5 లక్షల నుంచి 3.75 లక్షలకు పెరిగిందని, ఈసారి మరింత భారీ మెజారిటీతో తాను గెలుపొందుతాననే నమ్మకం ఉందని తివారీ అన్నారు.
Read More :
MLA Jagadish Reddy | కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉంది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

