Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. భారత్ ఏ సమయంలోనైనా సైనిక చర్యలు చేపట్టొచ్చని దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందంటూ ప్రపంచానికి చూపేందుకు భారత్ తనవంతు ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్తో మాట్లాడారు. ఇద్దరు నేతలు పహల్గాం ఉగ్రదాడి.. ఆ తర్వాత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇంతకు ముందు రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరిలో పీట్ హెగ్సెత్తో మాట్లాడారు. అమెరికా రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో అభినందలు తెలిపారు. ఇద్దరు నేతలు భూమి, వాయు, సముద్రం తదితర అంశాలపై చర్చలు జరిపారు. తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
పీట్ హెగ్సెత్ భారత్‌కు మద్దతు ప్రకటించారు. భారత్‌కు తనను తాను రక్షించుకునేందుకు హక్కుకు అమెరికా మద్దుతు ఇస్తుందని.. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా ఉంటుందని తెలిపారని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే చరిత్ర, మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి చరిత్ర ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలను ప్రపంచం ఖండించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
మరో వైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఏడుగురు తాత్కాలిక సభ్యులతో ఫోన్లో సంభాషించారు. అలాగే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతోనూ కీలక చర్చలు జిరపారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను, వారికి సహాయం చేసినవారిని, కుట్రదారులను కఠినంగా శిక్షించడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇరు దేశాల నాయకులు భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించగా.. పహల్గాం దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. డిలో మరణించిన 26 మంది అమాయకుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా నిలబడతామని రూబియో చెప్పారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని భారత్‌ను కోరామన్నారు. పహల్గామ్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.