మాజీ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ

చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చ
న్యూఢిల్లీ, జూలై 16: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రక్షణ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో కీలక భేటీ నిర్వహించారు. చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించారు. ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె కూడా హాజరయ్యారు. సోమవారం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ఈ భేటీ జరుగడం చర్చనీయాంశంగా మారింది. చైనా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ కేంద్రాన్ని తరుచూ నిలదీస్తున్నది. కాగా ఉత్తర సిక్కింలోని నకులా, తూర్పు లఢక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కాంక్రీట్ నిర్మాణాలను చేపడుతున్నట్టు మీడియాలో గురువారం కథనాలు వెలువడటం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

