జైపూర్: రాజస్థాన్‌కు చెందిన మంత్రి రాజేంద్ర సింగ్ గుదా(Rajendra Singh Gudha)ను ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గెహ్లాట్ అవినీతికి చెందిన చిట్టా తన వద్ద ఉందని, ఆయన బండారాన్ని బయటపెట్టనున్నట్లు మాజీ మంత్రి రాజేంద్ర తెలిపారు. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ నేతలు తనను అడ్డుకున్నట్లు చెప్పాAdd Newరు. తన వద్ద ఉన్న రెడ్ కలర్ డైరీలో గెహ్లాట్ అవినీతి చిట్టా ఉన్నట్లు రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. అసెంబ్లీ చైర్మెన్‌కు తన వద్ద ఉన్న రెడ్ డైరీని ఇవ్వడానికి వెళ్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారన్నారు.
సుమారు 50 మంది నేతలు తనను అటాక్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ నుంచి తననకు బయటకు గెంటివేసినట్లు ఏడుస్తూ తెలిపారు. తన వద్ద ఉన్న డైరీ గురించి అసెంబ్లీ చైర్మెన్ ముందు మాట్లాడకుండా చేశారన్నారు. తాను బీజేపీ నేతలతో కలిసి ఉండడం వల్లే .. వాళ్లు ఇలా చేశారన్నారు. దీంట్లో తన తప్పు ఏమి ఉందని రాజేంద్ర సింగ్ ప్రశ్నించారు. సీఎం గెహ్లాట్ సన్నిహితుడు ధర్మేంద్ర సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సమయంలో తనకు రెడ్ డైరీ దొరికినట్లు రాజేంద్ర వెల్లడించారు.
#WATCH | Congress leader Rajendra Singh Gudha was not allowed to enter the Rajasthan Assembly today after being removed as minister in Ashok Gehlot's cabinet. pic.twitter.com/aMVOt0JRbM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 24, 2023