జైపూర్: ఇదో వెరైటీ రొమాంటిక్ స్టోరీ. రాజస్థాన్‌కు చెందిన ఓ లేడీ పీటీ టీచర్ తన విద్యార్థినిని పెళ్లి చేసుకున్నది. లేడీ లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ లేడీ టీచర్ లింగ మార్పిడి చేయించుకున్నది. మగవాడిగా మారిన తర్వాత తన స్టూడెంట్‌నే ఆమె పెళ్లిచేసుకున్నది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పీటీ టీచర్ ఆరవ్ కుంతాల్ ఓ మహిళ. అయితే ఆమె కొన్నేళ్ల నుంచి తన విద్యార్థినితో డేటింగ్ చేస్తోంది. ఇటీవల కల్పనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. వాస్తవానికి ఇది విరుద్దమైన ఆచారమే అయినా.. ఆ పెళ్లికి ఇద్దరి పేరెంట్స్ ఒప్పుకున్నారు. టీచర్ ఆరవ్ అసలు పేరు మీరా. గవర్నమెంట్ స్కూల్లో ఆమె కబడ్డీ నేర్పించేది. ఆ స్కూల్లోనే కల్పన స్టూడెంట్.
Bharatpur, Rajasthan | Teacher undergoes gender change surgery to become a male & marry a student
"I always wished to undergo surgery to change my gender. I had my first surgery in December 2019," says Aarav Kuntal, teacher who changed his gender pic.twitter.com/S70JGrprwr
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 8, 2022
2016లో ఈ ఇద్దరి మధ్య పరిచయం జరిగింది. మీరా, కల్పనాల మధ్య మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ ముదిరింది. రెండేళ్లు ఫుల్ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఆ తర్వాత 2018లో కల్పనకు మీరా ప్రపోజ్ చేసింది. మీరా చేసిన పెళ్లి ప్రపోజ్లకు కల్పన అంగీకరించింది. కానీ తమ పెళ్లికి పేరెంట్స్ నుంచి వత్తిడి ఉంటుందని ఆ ఇద్దరు అమ్మాయిలు గ్రహించారు. అందుకే మీరా లింగమార్పిడికి సిద్దమైంది. కల్పనను పెళ్లి చేసుకునేందుకు మగవాడిగా మారేందుకు సర్జరీ చేయించుకున్నది.
సర్జరీ తర్వాత ఆరవ్‌గా పేరు మార్చుకున్నది. 2019 డిసెంబర్లో మీరా తొలి సర్జరీ చేయించుకున్నది. ఆరవ్‌ను ముందు నుంచే ప్రేమిస్తున్నానని, ఒకవేళ అతను సర్జరీ చేయించుకోకున్నా.. నేను అతన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని కల్పన పేర్కొన్నది. సర్జరీ సమయంలో ఆరవ్తోనే ఉన్నట్లు ఆమె చెప్పింది.