జైపూర్: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఆదేశాలు జారీచేసింది. అన్ని క్యాంపస్‌లలో లైవ్‌స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులు, ఉపాధ్యాయులను బడ్జెట్‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించేలా చూసుకోవాలని పేర్కొన్నది.
ఈమేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్‌కు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ లేఖరాశారు. రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానున్నది.
Rajasthan Govt issued an order directing all govt & private Universities to make arrangements for the live telecast of state budget so that a maximum number of students & teachers can watch the live telecast of the budget
The budget will be presented in State Assembly on Feb 10. pic.twitter.com/DVAXGnqbPM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 9, 2023