జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. కొవిడ్ నిబంధనల ప్రకారం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గెహ్లాట్ భార్య సునీతకు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా పరీక్షలు చేయించుకోగా, కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ -19 పరిస్థితులకు సంబంధించి ప్రతి రోజు రాత్రి 8:30 గంటలకు డాక్టర్లతో సమీక్ష జరుపుతానని ప్రకటించారు.
कोविड टेस्ट करवाने पर आज मेरी रिपोर्ट भी पॉजिटिव आई है। मुझे किसी तरह के लक्षण नहीं हैं और मैं ठीक महसूस कर रहा हूं। कोविड प्रोटोकॉल का पालन करते हुए मैं आइसोलेशन में रहकर ही कार्य जारी रखूंगा।
— Ashok Gehlot (@ashokgehlot51) April 29, 2021