లక్నో: సుమారు168 ఎలుకలు పట్టుకునేందుకు (Rats Catch) రూ.69 లక్షలు ఖర్చు చేశారు. సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని లక్నో డివిజన్ రైల్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ఉత్తర రైల్వేకు చెందిన లక్నో డివిజన్ సమాధానం ఇచ్చింది. 2020 నుంచి 2022 వరకు మూడేళ్లలో 168 ఎలుకలు పట్టుకున్నట్టు తెలిపింది. 2020లో 83, 2021లో 45, 2022లో 40 ఎలుకలను పట్టుకున్నట్లు పేర్కొంది. ఎలుకల నియంత్రణ కోసం ఒక్కో ఏడాదికి రూ.23.2 లక్షలు చొప్పున సుమారు రూ.69 లక్షలు వెచ్చించినట్లు వెల్లడించింది.
కాగా, రైల్వేలో అవినీతి, ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా దీనిపై మండిపడ్డారు. ఆరు రోజులకు ఒక ఎలుకను పట్టుకోవడానికి రూ.41,000ను రైల్వే వెచ్చించినట్టు విమర్శించారు. మూడేళ్లలో మొత్తం రూ.69.40 లక్షలు ఖర్చు చేసి 156 ఎలుకలను పట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇది ఒక్క లక్నో డివిజన్ పరిస్థితి అని పేర్కొన్నారు. ‘ప్రతిరోజూ దేశమంతటా ‘అవినీతి ఎలుకలు’ ప్రజల జేబులను కొల్లగొడుతున్నాయి. ఫలితంగా బీజేపీ పాలనలో ప్రజలు ప్రతిరోజూ విపరీతమైన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారు. రైలు ఛార్జీలలో వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా తినేశారు. అయినప్పటికీ ‘నేను తినను, మిమ్మల్ని తిననివ్వను’ అని ఆయన (మోదీ) అంటారు’ అని ఎక్స్‌లో విమర్శించారు.
మరోవైపు ఉత్తర రైల్వే లక్నో డివిజన్ దీనిపై వివరణ ఇచ్చింది. ప్రతి ఏటా సుమారు 25 వేల రైలు కోచ్‌లలో ఎలుకలు, బొద్దింకలు, బెడ్‌బగ్‌లు, దోమల నియంత్రణకు చేపట్టిన అనేక రకాల పెస్ట్ కంట్రోల్ చర్యల కోసం ఈ మేరకు ఖర్చు చేసినట్లు తెలిపింది. అలాగే ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చు అని పేర్కొంది.
एक चूहा पकड़ने में रेलवे ने ₹41,000 रुपए और 6 दिन खर्च कर डाले !
कुल 69 लाख 40 हज़ार रूपए खर्च करके,
3 साल में 156 चूहे पकड़े!ये तो अकेले लखनऊ रीजन का हाल है।
पूरे देश में "भ्रष्टाचार के चूहे" ऐसे ही हर रोज़ जनता की जेब काट रहे हैं ! "बागड़ बिल्लों" की "खुली लूट" तो देश देख… pic.twitter.com/9vk5STbTTf
— Randeep Singh Surjewala (@rssurjewala) September 17, 2023