రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్‌ను భారీగా పెంచింది. ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రూ.30కి పెంచింది. ఈ టికెట్ తీసుకున్న వాళ్లు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్లాట్‌ఫామ్ టికెటే కాదు.. లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచింది ఇండియన్ రైల్వేస్. లోకల్ రైళ్లలో ఇక నుంచి కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. కరోనా మహమ్మారి సమయంలో అనవసర ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఛార్జీలను పెంచినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం కోసమే తాత్కాలికంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలా చేయడం కొత్తేమీ కాదని, చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లనే నడుపుతోంది. ఇప్పటి వరకూ 65 శాతం రైళ్లు మళ్లీ పట్టాలెక్కినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

