Goa Polls | అధికారంలోకి వస్తే మైనింగ్, టూరిజం రంగాల పునరుద్ధరణ : రాహుల్ గాంధీ
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలపై పలు హామీలు గుప్పించారు. గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని అన్నారు.
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలపై పలు హామీలు గుప్పించారు. గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని అన్నారు. గోవాలో మైనింగ్, టూరిజం రంగాల పునరుద్ధరణకు తమ పార్టీ పాటుపడుతుందని భరోసా ఇచ్చారు. గోవాలో నిరుద్యోగ సమస్య యువతను వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెరిగేందుకు గోవాలో టూరిజం పునరుద్ధరణకు తాము చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మైనింగ్‌ను చట్టబద్ధంగా పునఃప్రారంభించేందుకు కసరత్తు సాగిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మార్గోవాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవా అభివృద్ధికి తమ వద్ద సరైన విజన్ ఉందని స్పష్టం చేశారు.
న్యాయ్ పధకం ప్రవేశపెడతామని, అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు రూ 6000 జమ చేస్తామని చెప్పారు. మహిళలకు 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాము విస్పష్ట మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోవాను ఐటీ హబ్‌లా మలిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీలు మారే వారికి వలస పక్షులకు తాము టికెట్లు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించారని దుయ్యబట్టారు.
గత ఐదేండ్లుగా మోదీ దేశానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. 2014లో కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ప్రస్తుతం ఉపాధిపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో మోదీ దేశ యువతను మోసగించారని విరుచుకుపడ్డారు. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పర్యావరణం వంటి వాస్తవ అంశాలను ప్రదాని మోదీ ప్రస్తావించరని దుయ్యబట్టారు. ఇక ఈనెల 14న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

