Rahul Gandhi : కొవిడ్ టీకా తీసుకున్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi : కొవిడ్ టీకా తీసుకున్న కాంగ్రెస్ నేత |

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 28న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన గురు, శుక్రవారాల్లో పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని పేర్కొన్నాయి. రాహుల్ ఏప్రిల్ 20న కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రియాంకగాంధీ మే నెలలో తన మొదటి డోసు టీకా తీసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ వ్యూహంపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, రాహుల్ కొవిడ్ టీకా ఎందుకు తీసుకోవడం లేదని గతంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రతోపాటు పలువురు ప్రశ్నించారు.
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మందగించడానికి రాహుల్ గాంధీ కారణమని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఆరోపించారు. రాహుల్ గాంధీ, అతని కుటుంబసభ్యులు టీకాలు తీసుకున్నారో? లేదో? సకాలంలో సమాచారం ఇచ్చి ఉంటే చాలామంది కరోనాతో చనిపోయేవారు కాదని, ప్రజల మనసులో సందేహాలు సృష్టించినందువల్లే వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగిందని మీనాక్షి విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాక్సిన్ తీసుకొని సస్పెన్స్‌కు తెరదించారు. మరో వైపు కేరళలో పెరుగుతున్న కరోనా కేసులపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అన్ని భద్రతా చర్యలను అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
Rashad hussain । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
Covid-19 । దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

