Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)
మరోసారి ట్రక్కు రైడ్ (truck ride)కు వెళ్లారు. ప్రస్తుతం రాహుల్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ వాషింగ్టన్ డీసీ (Washington DC) నుంచి న్యూయార్క్ (New York) వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు.
ట్రక్కు డ్రైవర్ తల్జీందర్ సింగ్ తో కలిసి ప్రయాణించిన రాహుల్.. అమెరికాలో పనిచేసిన వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రక్కు డ్రైవర్లు ఎలా పనిచేస్తారు..?, చలాన్లు, వేగ పరిమితి, డ్రైవర్ల ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత డ్రైవర్ ‘ఏదైనా పాట వినిపించనా’ అని రాహుల్ ని అడిగాడు. అందుకు రాహుల్ ‘ఏదైనా సరే’ అని బదులిచ్చాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దూ మూసేవాలా (Sidhu Moose Wala) పాట పెట్టమంటారా..? అని అడగ్గా.. ‘295’ సాంగ్ ను ప్లే చేయమని రాహుల్ కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Earthquake | ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం
IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన తోక భాగం
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ