IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన తోక భాగం
IndiGo | ఇండిగో (IndiGo) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi IGI Airport)లో విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోక (tail) భాగం నేలకు తాకింది.
IndiGo | ఇండిగో (IndiGo) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi IGI Airport)లో విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోక (tail) భాగం నేలకు తాకింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కోల్ కతా – ఢిల్లీ ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం జూన్ 11వ తేదీన కోల్ కతా నుంచి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ప్రమాదవశాత్తు దాని తోక భాగం రన్ వేపై నేలను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను అధికారులు నిలిపివేశారు.
ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యేంత వరకు విమానంలో ఎలాంటి సమస్యా తలెత్తలేదని తెలిపింది. రన్ వేపైకి చేరుకునే సమయంలో సాధారణం కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలెట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. కిందకు దిగే సమయంలో విమానం తోక ఒక్కసారిగా రన్ వేను తాకినట్లు వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీజీసీఏ తన ప్రకటనలో తెలిపింది.
Also Read..
Rajasthan woman | బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన రాజస్థాన్ యువతి
Kazan Khan | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

