న్యూఢిల్లీ : గత పదేండ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ.. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 152 పేపర్లు లీక్ అయితే ఇందులో ఒక్కరికి కూడా శిక్ష వేయలేదని రాహుల్ విమర్శించారు.
ప్రపంచంలోనే మేటిగా ఉన్న విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఇందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు ఏం తప్పు చేస్తే పోలీసులు లాఠీచార్జి చేశారని ప్రశ్నించారు. నిరసన చేస్తున్న విద్యార్థులను గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.