చెన్నై: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తండ్రి, మాజీ గూఢచారి రాఘవాచారి గోవిందరాజన్ (94) చెన్నైలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గోవిందరాజన్ 1953 బ్యాచ్ టాప్ ర్యాంక్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన కెరీర్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)కు వెళ్లారు. 36 ఏళ్ల కెరీర్లో అనేక పదవులు నిర్వహించారు. జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్గా పదవీ విరమణ చేశారు.